Saturday, November 23, 2024
HomeతెలంగాణKCR 100% successful: గులాబీ జెండా ఎత్తిన నాడు గేలి చేశారు..ఉద్యమ స్మృతిలో..

KCR 100% successful: గులాబీ జెండా ఎత్తిన నాడు గేలి చేశారు..ఉద్యమ స్మృతిలో..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా….తెలంగాణ ఉద్యమస్మృతిలో..ఉద్యమ కాలం నాటి ముచ్చట్లు..

- Advertisement -


తెలంగాణ కోసం గులాబీ జెండా ఎత్తిననాడు ఎంతో మంది మనల్ని గేలి చేశారు.. ‘ఏం దుకాణం పెట్టిండ్రు’ అని తేలికగా మాట్లాడారు. వాళ్లందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించాం. ఈ రోజు కూడా చేతకాని, చేవలేని, కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న కొందరు ఇదెట్టా.. అదెట్టా అని మాట్లాడుతున్నరు. మనం రైతుబంధు పెట్టిననాడు కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు ఎంతో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. ఏ రాష్ట్రంలోలేని విధంగా రైతుబీమా అనే అద్భుతమైన పథకాన్ని పెట్టుకున్నాం. రైతుల తలరాతలు కిందమీద చేసేలా నేత, గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో సఫలీకృతమయ్యాం. సింగరేణి కార్మికులకు దేశంలోనే ఎవరూ ఇవ్వనంత బోనస్‌లు ఇస్తున్నాం. పింఛన్‌ 2 వేలు చేశాం. తెలంగాణలో తప్ప బీడీ కార్మికులకు పింఛన్‌ మరే రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని, ఉన్న వనరులు అతి జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఇదే పంథాలో ముందుకు సాగుతాం.
అని సగర్వంగా తలెత్తుకునేల చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జలవినియోగ ప్రాజెక్టులను నిర్మిస్తూ రాష్ట్ర ప్రజల సౌఖ్యం కోరే ముఖ్యమంత్రి కేసిఆర్ దేశరాజకీయలలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించి మరల ప్రజల్లోకి నేరుగా వెళ్లి లోతుగా ప్రజాసమస్యలను తెలుసుకుని ప్రజాపాలనలో ముందు ఉండే నాయకుడి ఆశయాలు అశేష ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తాయి.బంగారు తెలంగాణ నవభారత అభివృద్ధిలో నాంది అవుతుంది దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసిఆర్ నేతృత్వంలో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించి రాష్ట్ర ప్రజల సంక్షేమంలో సాధికారతను సాధిస్తుంది. తెలంగాణను అర్ధం చేసుకోవడంలో కేసీఆర్ 100 శాతం సఫలమవుతూనే ఉన్నారు.
ఆయన విజయవంతంగా నడిపిన తెలంగాణ ఉద్యమం, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ విషయాన్ని రుజువు చేసినయి అయినా తెలంగాణను బాగు చేసుకునే హక్కు తెలంగాణ ప్రజలకు ఉన్నట్లే తెలంగాణను నాశనం చేసుకునే హక్కు కూడా తెలంగాణ ప్రజలకు ఉంటుంది. 1953 లో ఆంధ్రాలో తెలంగాణను కలపకుండా నిరోధించడంలో అప్పటి తెలంగాణ నాయకులు విఫలమయ్యారు. అప్పుడు కేసీఆర్ లాంటి ఒక దమ్మున్న నాయకుడు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు దమ్మున్న నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణను అన్ని రకాలుగా బాగు చేస్తున్న నాయకుడు కేసీఆర్ ఆలోచనలను, దూర దృష్టిని అర్ధం చేసుకోలేకపోతే తెలంగాణ సమాజమే నష్టపోతుంది
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉంది..? ఇప్పుడు కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఎలా ఉందో తెలుసుకోలేనంత, అంచనా వేయలేనంత స్థితిలో తెలంగాణ సమాజం ఉందా..సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలా అన్నింటిలో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్ర భాగాన ఉన్న విషయం తెలంగాణ సమాజానికి తెలియదా
తెలంగాణ మేలు కోసం కేసీఆర్ పడుతున్న తపనను, ఆరాటాన్ని మర్చిపోయి పనికి మాలిన వెధవలు చేసే ప్రచారాన్ని చూసి హేళనగా మాట్లాడుకునే వాళ్లను చూస్తే మనకు నిజంగా జాలి కలగడం లేదా ? కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నాడు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని కేవలం బిఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నది. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారు.ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నది. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. బిఆర్ఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒక పథకం అంది ఉంటుంది ఓట్లు రాగానే కొందరు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఇక్కడే ఉండి, మన కోసం ఆలోచించే వాళ్ల కు మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల, ఆర్తి ఉంటుంది. ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఈ ప్రాంత సమస్యలు తెలువదని, ఇక్కడి వారే కాదు, అలాంటి వారిని ఎన్నుకుంటే మనకు జరిగే అభివృద్ధికర ప్రయోజనం ఏమీ ఉండదని….

  • ఆలేటి రమేశ్
    ప్రజా సంబంధాల అధికారి
    9948798982.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News