Friday, December 27, 2024
HomeతెలంగాణKCR: కేసీఆర్, హరీష్‌ రావుకు హైకోర్టులో భారీ ఊరట

KCR: కేసీఆర్, హరీష్‌ రావుకు హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ(Medigadda) వంతెన కుంగుబాటు కేసులో భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. అలాగే ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

కాగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ వంతెన గతేడాది ఎన్నికల సమయంలో కుంగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మేడిగడ్డ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో పెట్టింది. అక్కడికి ఎవరిని వెళ్లనీయకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మేడిగడ్డ కుంగుబాటుకు అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు నిర్లక్ష్యమే కారణంటూ ఓ వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఈ వారిద్దర హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం జిల్లా కోర్టు నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News