KCR responded on chevella bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ ను కోరారు. అదేవిధంగా గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేటీఆర్ సంతాపం.. తక్షణ సాయం కోసం విజ్ఞప్తి: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సాయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


