తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పుట్టినరోజు కావడంతో రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన నమస్తే తెలంగాణ సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అర్చకులు వేదిక మీదకు పూలదండలు, ఉంగరాలు తీసుకువచ్చారు. కేసీఆర్ దంపతులను దండలు, ఉంగరాలు మార్చుకోవాలని కోరగా.. ఒకరికొకరు పూలదండలు మార్చుకుని, ఉంగరాలు తొడుక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.