బీఆర్ఎస్ నేత కుమారుడి వివాహానికి పార్టీ అధినేత కేసీఆర్(KCR) హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి కేసీఆర్, శోభమ్మ దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ దంపతులకు వెంకటయ్య యాదవ్ కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.