తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకల సందర్భంగా కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భారీ కేక్ ను కట్ చేశారు. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు భారీ జనసందోహం మధ్య కవిత కేక్ కట్ చేశారు. ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు సాగగా ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక తెలంగాణ రూపశిల్పి KCR అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఈ సంబరాలు ఆద్యంతం కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు జరుపుకున్నాయి.