గద్వాలలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అయిజ రోడ్డులో ఏర్పటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
- Advertisement -
గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు.. 12 మండలాలు.. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది వరకు ఇక్కడకు రాలేదు.. తొలిసారి వచ్చిన కాబట్టి.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. ఈ నిధులతో మున్సిపాలిటీలు బాగుపడాలి.