Wednesday, September 11, 2024
HomeతెలంగాణCondolence: శ్రీధర్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

Condolence: శ్రీధర్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత, ఎం. శ్రీధర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నాటి 1969 ఉద్యమంలో క్రియాశీలంగా, కీలక పాత్రను పోషించారని, తాను నమ్మిన విలువల కోసం శ్రీధర్ రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News