యశోదా ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిస్చార్జ్ అయ్యారు. ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద లో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వారం రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.
- Advertisement -
ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లకు నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.
యశోద నుండి నేరుగా నంది నగర్లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్ కు సాంప్రదాయ పద్దతిలో దిష్టి తీసి, హారతి పట్టి స్వాగతించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.