బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి నందినగర్‌లోని ఇంటికి చేరుకోనున్నారు.
కాగా బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఇందుకు పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.