Kaleshwaram : తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు! మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (KLIP)పై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
ALSO READ:Thirupathi : ఏఐతో శ్రీవారి దర్శనం 1-2 గంటల్లోనే.. ఎలా అంటే!
ఇక జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని.. డిజైన్ లోపాలు, బ్యారేజీల కుంగుబాటు వంటి సమస్యలు ఉన్నాయని బయటపడ్డాయి. కేసీఆర్‌ను పూర్తి బాధ్యుడిగా చూపిస్తూ, ప్రాజెక్టు ప్లేస్, డిజైన్, ఆర్థిక అంచనాలు మార్చడంలో ఆయన పాత్ర ఉందని నివేదిక సూచించింది.
ఈ కమిషన్ జూలై 31, 2025న సమర్పించిన ఈ రిపోర్ట్‌ను రద్దు చేయాలని, కమిషన్ నియమన GOను కొట్టేయాలని పిటిషన్లలో కోరారు. తమకు సరైన నోటీసులు ఇవ్వలేదని.. యాక్ట్ సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం విచారణలో లోపాలున్నాయని ఆరోపించారు. ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరారు. హరీష్ రావు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపుతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు.
గతంలో విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేసి కేసీఆర్ రిలీఫ్ పొందారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా అదే జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశించబడింది.. కానీ అవినీతి ఆరోపణలతో వివాదాస్పదమైంది. హైకోర్టు విచారణ తర్వాత నివేదిక ఎలా రానుందో తెలియాల్సి ఉంది.


