బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్ నుంచి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమీక్షా సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌లో సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.