Sunday, October 6, 2024
HomeతెలంగాణKCR @ Manchiryala: బిఆరెస్ కి బాసులెవ్వరు లేరు ప్రజలే బాసులు

KCR @ Manchiryala: బిఆరెస్ కి బాసులెవ్వరు లేరు ప్రజలే బాసులు

2,184 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి

బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక్షంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు, వైఎస్ఆర్ టి.పి చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దుర్గం నగేష్, బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పత్తి శీను, విరితోపాటు పలువురికి బిఎస్ఆర్ పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా ఆశీర్వాద సభ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ… సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలపై వేసేది కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తాం. సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. షెడ్యూల్ ఏరియాలో ఉన్న మందమర్రి పట్టణంలో కూడా జీవో 76 ద్వారా సింగరేణి జాగాలో ఇండ్లు కట్టుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇస్తాం. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం.

- Advertisement -

మందమర్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగేలా చూస్తాం. మందమర్రి పట్టణంలో కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు. మందమర్రి, రామకృష్ణాపూర్ రెండు పట్టణాలకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో 50 పడకల ప్రభుత్వ దావాఖాన నిర్మిస్తాం. మందమర్రి పట్టణంలో లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాల్లో ముంపునకు గురవుతున్న భూములకు శాశ్వత పరిష్కారం. కరకట్ట కట్టడం లేదా నష్టపరిహారం అందించి భూమిని ప్రభుత్వమే సేకరించడం. చెన్నూరులో కొత్త పీజీ కళాశాల, మందమర్రి లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో సూట్ కేసులతో వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు ఎవరు నమ్మవద్దని బిఆర్ఎస్ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. 75సం సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఎన్నికలు వచ్చినా కూడా డబ్బులు పంచుతున్నరని అన్నారు. ప్రజల ఓటు చాలా విలువైనదని ఇప్పుడు జరిగే ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు ఓటు వేసి బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు. కేంద్రంలో ఢిల్లీ సర్కార్ గాని మరెవరు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు బాసులు కాదని ఓటు వేసిన ప్రజలు మాత్రమే ఈ పార్టీ యొక్క బాస్ అన్నారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో చావుతో పోరాటం చేస్తూ 15 ఏళ్లుగా ఉద్యమం సాగించినట్లు గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు కరెంటు తోపాటు ఎటువంటి సదుపాయాలు ప్రజలకు లేవని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నరని తెలిపారు.

134 ఏళ్ల సింగరేణి సుదీర్ఘ చరిత్రలో ప్రస్తుతం సింగరేణి బొగ్గు సంస్థలొ ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఇంకా ఇప్పటికి నిలువగా ఉన్నాయన్నారు. గతంలో సింగరేణి బొగ్గు సంస్థాను కాంగ్రెస్ ప్రభుత్వం 49 శాతం వాటాతో కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు ఆరోపించారు. మందమర్రిలో లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగేలా చూస్తామన్నారు. సింగరేణి ప్రస్తుతం 2వేల 184 కోట్ల లాభంలో నడుస్తుందని దసరా దీపావళి బోనస్ లో కార్మికులకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు పంచుతుందన్నారు.32 శాతం లాభాల వాటా ఇప్పించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కే దక్కిందన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటివరకు 45 వేల ఇండ్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేశమన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ బొగ్గు సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న తరుణంలో రెండు బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు పరం చేయబోతే బాల్క సుమన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. రైతు బంధు పథకంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నట్లు ప్రసంగించారు. ఉచిత కరెంటు ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడంతో రైతు భూమిని రైతుకే ఇచ్చినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మాటలను నమ్మవద్దని తెలిపారు. దళారుల రాజ్యం రావద్దని కోరారు. దేశంలోనే 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కినట్లు ప్రకటించారు. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించడంతోపాటు కాలేజ్ గా మార్చినట్లు రాబోయే కాలంలో డిగ్రీ కాలేజ్ గా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే దళితులు అణిచివేతకు గురి అవుతున్న దృష్ట్యా బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టినట్లు రాబోయే కాలంలో అందరికీ దళిత బంధువు అందేలా కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఓడించిన ఘనత ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్లకే దక్కిందన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టినట్లు వెల్లడించారు.

హైదరాబాదులో 125 అడుగుల ఆకాశాన్నంటే అంబేద్కర్ విగ్రహమును నిర్మించినట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ సన్న బియ్యంతో పాటు ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ తక్కువ ధరకే వంట గ్యాస్ సమకూర్చే విధంగా పొందుపరిచినట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికుల విషయమై తప్పకుండా న్యాయం చేస్తామని టాక్సీ పేరిట ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మందమర్రిలో కొత్తగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ కారు గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News