Friday, September 20, 2024
HomeతెలంగాణKCR on Palamuru: నాడు ఎండింది నేడు నిండింది, జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలదరిస్తది

KCR on Palamuru: నాడు ఎండింది నేడు నిండింది, జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలదరిస్తది

నాడు పాలమూరు జిల్లా ఎండిపోయింది..నేడు ధాన్యరాశులతో నిండిపోతున్నదని కేసీఆర్ సగర్వంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లాలో పర్యటించినప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ రోజుల్లో ఫ్రొఫెసర్ జయశంకర్ గారు నేను మిత్రుడు లక్ష్మా రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ వెళ్ళి వస్తావుంటే నవాపేట మండలంలో చిన్న పాటి అడవి ఉంటది . అమ్మవారి గుడి దగ్గర.. నేను జయశంకర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ లక్ష్మారెడ్డి గారితో అన్నాము. ఏమండి లక్ష్మారెడ్డి గారు డాక్టర్ గారు మీ జిల్లాలో చెట్లు కూడ బక్కగా అయిపోయని ’’ ఇదేం అన్యాయం అని జెప్పి మాట్టాడుకుంటూ వచ్చాం’’ అనే సంధర్భాన్ని సిఎం కేసిఆర్ గుర్తు చేసుకున్నారు. తొలి నాల్లలో మాజీ ఎమ్మెల్యే, మాజీ సమితి ప్రెసిండెంట్, ఉత్తమ మైన ప్రజా నాయకుడు కీ.శే.ఎడ్మ కృష్ణారెడ్డి వారి కొడుకు ఎడమ సత్యం అప్పుడు జెడ్పిటిసి ఎన్నికల్లో పోటి జేస్తే నన్ను రమ్మని పిలస్తే, నేను వరంగల్ నుండి చాలా దూరం లో ఉన్నాను కాబట్టి హెలికాప్టర్ లో వచ్చిన. వచ్చే క్రమంలో మొత్తం నల్లగొండ, దేవరకొండ ,మునుగోడు కల్వకుర్తి మీదగా వచ్చినం, కిందకు చూస్తే ఎక్కడ చూసిన ఎండిపోయన ఎడారి ప్రాంతంలా కనబడిన నేలను చూసి కండ్లల్లో నీళ్ళు పెట్టుకుని బాధపడ్డం”..అని కేసీఆర్ గతాన్ని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

“నేను అలంపూర్ జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేస్తే ఆరోజు కూడ అనేక అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలదరించే పరిస్థితి. నడిగడ్డ లో ప్రజల పరిస్థితి చూసి మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు నేను అందరం కండ్లనీళ్ళు పెట్టుకున్నాము మేము ఏడవడమే కాదు ఆ రోజు ఊరంతా ఏడ్చారు . అప్పటి వేదనలు, రోధనలు గుండే అవిశిపోయే బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల గద్వాల శాసనసభ్యుడు క్రిష్ణమోహన్ రెడ్డి గారి తండ్రిగారు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎక్కడి వరకు దారి పొడవున ఎటుచూసిన పంట కోతలు కోసేటువంటి హర్వేష్టర్లు, దాన్యం కల్లాలలో ధాన్యం రాశులు అమ్ముతున్నటువంటి రైతులను చూసి చాలా ఆనందపడుతూ పోయినం. ఏ తెలంగాణ కావాలని కోరుతున్నాము దేని కోసం అయితే పోరాటం చేసినమో అది ఆ బాట పట్టింది. ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించాలని ముందుకు పోతున్నం” అని సిఎం కేసిఆర్ గతంలో తెలంగాణ పరిస్థితులను, ప్రస్థుత పరిస్థితులను పోల్చూతూ సాధిస్తున్న ప్రగతిని తెలియజెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News