Friday, September 20, 2024
HomeతెలంగాణKCR on Welfare: కంటి వెలుగు, కేసీఆర్ కిట్..అద్భుత ఫలితాలు ఇలాగే వస్తాయన్న సీఎం

KCR on Welfare: కంటి వెలుగు, కేసీఆర్ కిట్..అద్భుత ఫలితాలు ఇలాగే వస్తాయన్న సీఎం

కేసీఆర్ ప్రసంగాలంటే ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలుసు. పుస్తకం చదివినట్టు అవి ఎంతో ఆసక్తిగా, విజ్ఞానదాయకంగా ఉంటాయి. గతంలో జరిగిన విషయాలను ఆయన పూసగుచ్చినట్టు వివరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల పుట్టుక వెనుకున్న కథలు ఆయన వివరించటం విశేషం.

- Advertisement -

తెలంగాణ ప్రజానీకం కొన్ని విషయాలు దయచేసి గమనించాల్సి ఉందని సిఎం కేసిఆర్ అభిప్రాయ పడుతూ.. కంటి వెలుగు పథకం రూపకల్పనకు దారితీసిన విషయాన్ని తెలియజేస్తూ ఇలా వివరించారు.. “గజ్వేల్‌లోని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేద్దామంటే..ఊరివాళ్లకు మంచి విశ్వాసం కల్పించాలనే మంచి ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. ఆ చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువతలేరని స్కూల్‌లో టీచర్లు, ఇండ్లల్లో తల్లిదండ్రులు కొడుతున్నరు. దీనిపై చాలా బాధపడి ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. వాస్తవానికి చెప్పకూడనిది ఏంటంటే కంటి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందరికీ సరోజిని దవాఖాన ఒక్కటే. అంతకు మించి ఏమీ లేదు. అలాంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఆ తర్వాత చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చాం . అంతేకాని చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం తెచ్చింది కాదు కంటి వెలుగు” అని సిఎం అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ కిట్ పుట్టిందిలా..
తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకు వచ్చిందే ‘కేసీఆర్‌ కిట్‌ అనే కార్యక్రమం అని సిఎం అన్నారు. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం ఉద్ధేశ్యం కాదు అని అన్నారు . టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తాం. ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయమని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలు గర్భం దాల్చిన తర్వాత కూడా ఉపాధి కోసం పని చేస్తునే ఉంటారు. పని చేస్తే ఆ గర్భిణులకు, జన్మించే శిశువు కు మంచిది కాదు. ఎందుకు పని చేస్తున్నరనే విషయంపై అధ్యయనం చేశాం. ధనవంతులు వాళ్ల బిడ్డలకు ఏమో ఇంట్లోని వాళ్లు శ్రీమంతాలు వగైరా పండగలు చేస్తారు. ‘ఈమె నీళ్లుపోసుకున్నదయ్య ఇప్పుడు కూసుండబెట్టి తిండిపెట్టాలే’.. ఇది పేదింట్లో వచ్చే మాట.. నేను కూడా పల్లెటూరులో పుట్టాను కాబట్టి.. నా చెవులతో విన్నకాబట్టి. ఎందుకంటే పేదరికం, దరిద్య్రం వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నది అని. కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే ఒకటి ఇనిస్టిట్యూషన్‌ డెలివరీలు ప్రోత్సహించాలి. మరొకటి మహిళ పని చేయకపోవడం ద్వారా ఏదైతే డబ్బు కోల్పోతదో దాన్ని మనం ఇవ్వాలనేదే కేసీఆర్‌ కిట్‌ ఉద్దేశం అని సిఎం అన్నారు. అందుకోసం తీసుకున్న చర్యలలో భాగంగా ప్రభుత్వ అధికారి స్మితాసబర్వాల్‌తో పాటు మహిళా ఐఏఎస్‌ అధికారులను పలు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించామని . గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వాళ్లకు సంభవించే వేజ్‌ లాస్‌ను సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే భరించేలా కార్యక్రమాన్ని చేపట్టి, ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు పెరిగేలా అమ్మ ఒడి వాహనాలను తీసుకువచ్చాం. గర్భం దాల్చినప్పటి నుంచే సేవలు అందించడంతో పాటు మళ్లీ ప్రసవం అయిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ అందించి తల్లీ బిడ్డను ఇంటి వద్ద దింపి రావడం వంటి సేవలను అందించడం భారతదేశంలో తెలంగాణలోనే ఇది సాధ్యమవుతున్నది’ సిఎం అన్నారు.

సంస్కరణలు నిరంతర ప్రక్రియ
“ఏరకమైన కార్యక్రమం తీసుకున్నా మానవీయ దృక్పథంతో.. ప్రజలకు మేలు జరుగాలని. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేధోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అని సిఎం అన్నారు. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు.ఎప్పటికప్పుడు మేధో మధనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి సంఘటితం అయి పని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఏడేళ్ల కిందట మన బడ్జెట్‌ ఎందో తెలియదు, ఎకనామిక్‌ ట్రెండ్‌ ఏంటో తెలియదు. మనకు శాపాలు పెట్టిన వారున్నారు.. దీవెనలు పెట్టిన వారున్నారు. ఇప్పుడు మనముందున్నది అందరి సమష్టి కృషి ఫలితం” అని సిఎం కేసిఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News