Tuesday, March 25, 2025
HomeతెలంగాణKCR: పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

KCR: పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలపై కూడా మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి కూటమితో పొత్తు పెట్టుకోవడమే కారణమన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోదిగి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. BRS తిరిగి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. తాము ఎవరితో పొత్తులు పెట్టుకోమని.. సింగిల్‌గానే పోటీకి దిగుతామని.. గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పారు. తెలంగాణలో సంపద ఎక్కువగా ఉందని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. కొన్ని రాజకీయ పార్టీలపై, అధికారాన్ని ఆశిస్తున్న నేతలపై ఘాటుగా విమర్శలు చేశారు.

- Advertisement -

రాష్ట్రాన్ని సాధించి.. 10 సంవత్సరాలు అభివృద్ధిలో నడిపించామని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా గడిపారని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని.. ఎన్నికల్లో సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ రోజుల్లో ప్రధాని మోదీ నా మెడపై కత్తిపెట్టినా వెనక్కి తగ్గలేదు అని చెప్పారు. తెలంగాణ కోసం ఎప్పుడూ పోరాడేది, తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్న రైతు బంధు, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు నిజానికి బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైనవే అని గుర్తుచేశారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలనే మళ్లీ హామీలుగా మార్చుకుని, వాటిని అందించలేకపోతున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తు లేకుండా చంద్రబాబు గెలిచేవారు కాదు అని అన్నారు. పాలిటిక్స్‌లో ఎవరు శాశ్వతం కాదు.. మార్పు సహజమని అన్నారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయన చేసిన ఈ కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News