Friday, November 22, 2024
HomeతెలంగాణKCR @ Vardhannapeta: రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్

KCR @ Vardhannapeta: రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్

వారికి తెలంగాణ పెత్తనం కావాలి

వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ (సీఎం కేసీఆర్ గారి ప్రసంగ ముఖ్యాంశాలు)

- Advertisement -

• ఈ రోజు మళ్లీ ఎన్నికలు వచ్చినయి. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి వచ్చిన ఎన్నికలు
• 24 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు, ఆరోజు ఎవరికి తెలంగాణ వస్తదనే నమ్మకం లేదు. అవహేళన చేసినారు. పొత్తు పెట్టుకుని గెలిచి 14 సంవత్సరాలు ఏడిపించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.
• అనేక మంది యువకుల చావులు చూసినారు. నేను చివరికి చావునోట్లో తలకాయ పెట్టాను.
• తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తేఅప్పుడు దిగి వచ్చి 15 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది.

• ఒక్కో సమస్యను అధిగమించుకుంటూ ముందుకు పోతున్నాం
• కొందరు వచ్చి అవాకులు , చెవాకులు వాగుతారు.
• తెలంగాణ మీద కాంగ్రెస్ వారికి పట్టి లేదు. వారికి తెలంగాణ పెత్తనం కావాలి. తెలంగాణలో అధికారం కావాలే. తెలంగాణ ప్రజల సంక్షేమం కాని అభివృద్ధి కాని పట్టలేదు.
• 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వర్ధన్నపేటను పట్టించుకోలేదు.
• ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది.


• ఐనవోలు, హసన్ పర్తి మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకున్నాం
• ఆరూరి రమేశ్ ప్రజల్లో ఉండే వ్యక్తి
• ఇటీవలే రూ. 160 కోట్లు తెచ్చి వర్ధన్నపేట పట్టనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం
• షాట్ కట్ మెథడ్ లో కాంగ్రెస్ రావాలని చూస్తుంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
• వర్థన్నపేటలో రింగ్ రోడ్డుకు పూలింగ్ ఉండదు. ఎవరి జాగాకు నష్టం ఉండదని హామీ ఇస్తున్నాను
• నేను చెప్పిన మాటలను మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి


• రైతుబంధు దుబారానా మంచి కార్యక్రమమా మీరే చెప్పాలి
• కాంగ్రెస్ పార్టీ రైతుబంధు వద్దని చెబుతూ ఉంది.
• మూడు గంటల కరెంటుతో పొలం పారుతదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడు గంటలు కరెంటు ఇస్తే చాలు అంటున్నాడు
• రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్
• మింగుడు బంధు గత పాలకుల హయాంలో ఉండేది

• వ్యవసాయ రంగంలో మిషన్ కాకతీయ తీసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం

• అబద్ధాలు విని మోస పోవద్దు

• రెండు సార్లు ఆరూరి రమేశ్ను గెలిపించారు. ఒక సారి 80 వేలతో, మరోసారి 90 వేలతో గెలిపించారు. ఈ సారి లక్ష దాటాలి. నా మెజారిటీ కన్నా ఎక్కువ రావాలి.

• కాంగ్రెస్ హాయాంలో ఎట్ల ఉండే ఇప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ

• మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప ముఖ్యమంత్రికి కూడా మీ భూమిని బదలాయించే హక్కు ఉండదని చెబుతున్నాను.

• రైతు రాజ్యంగా , పేదల రాజ్యాంగ , సంక్షేమ రాజ్యంగా, పురోగమిస్తున్న రాజ్యంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది.

• అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ

• అవాకులు చవాకులు పేలే వాళ్ల మాటలు పట్టుకుంటే ఆగమై పోతరు

• ప్రజలను ప్రజల్లా కాంగ్రెస్ పార్టీ చూడటం లేదు

• అన్ని వర్గాల కోసం రెసిడెన్షియల్ స్కూల్లు ఇచ్చిన ఘనత బీఆర్ ఎస్ గవర్నమెంటుది

• విలీనం అయిన 40 గ్రామాల ప్రజలకు సాదాబైనామా ఇప్పించే బాధ్యత నాదే . ఎన్నికల తర్వాత అమలు చేస్తాం. అభివృద్ధికి నిధులు ఇస్తాం

• పారిశ్రామికంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలే.

• దయాకర్ రావు, కడియం శ్రీహరి ఆశీస్సులు ఆరూరి రమేశ్ కు ఉంటాయి.

సభలో మంత్రులు ఎరబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి ఛైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్,బసవరాజు సారయ్య, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లు ఆరూరి రమేశ్, వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ , ఎంపీ దయాకర్ , వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News