KCR Jubilee Hills By- Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్ జాబితాను బీఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 40 మంది పేర్లతో జాబితాను ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ అందజేసింది. ఈ లిస్ట్‌ను ఎన్నికల కమిషన్ ఆమోదించింది. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో కేసీఆర్ పేరు ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/nominations-ends-to-file-in-jubilee-hills-by-election/
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. గెలుపు జెండా ఎగురవేసి జీహెచ్ఎంసీ పరిధిలో సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో గత కొద్ది నెలల ముందు నుంచే ఈ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నికలో విజయం కోసం వ్యూహం రచించారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రతీ డివిజన్‌కు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇన్చార్జులుగా నియమించగా.. ఇప్పటికే ఆయా నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, అన్నీ పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ప్రకటించారు.
ఈ క్రమంలో భారీ బహిరంగ సభలకు కొంత దూరంగా ఉన్న కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చివరి రోజుల్లో కేసీఆర్ రోడ్ షో లేదా భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలో క్లారిటీ రానుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..@BRSparty pic.twitter.com/abOEpBoCVa
— BRS Party Bellampalli (@TrsBellampalli) October 21, 2025


