Monday, January 20, 2025
HomeతెలంగాణKingfisher Beer: మందుబాబులకు గుడ్ న్యూస్.. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కీలక ప్రకటన

Kingfisher Beer: మందుబాబులకు గుడ్ న్యూస్.. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కీలక ప్రకటన

తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. కింగ్ ఫిషర్(Kingfisher) బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News