రాష్ట్ర సచివాలయంలో రైతు భరోసా(Rythu Bharosa)పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు.
అలాగే ఈ పథకం అమలు కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశముంది. రైతు భరోసా విధి, విధానాలపై ఈనెల 4వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో తుది నిర్ణయంం తీసుకోనున్నారు. అనంతరం జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనుంది.