Friday, January 31, 2025
HomeతెలంగాణPhone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితుడికి బెయిల్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితుడికి బెయిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4 నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. కాగా హైకోర్టు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ గత 10 నెలలుగా జైల్లో ఉన్నారని.. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. అందుచేత పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది.

- Advertisement -

అలాగే ట్రయల్ విచారణకు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని తిరుపతన్నను హెచ్చరించింది. సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దకు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదించగా.. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News