Monday, April 28, 2025
Homeతెలంగాణతెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్

తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలిచిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఘనంగా జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో 154 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, నీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, వైద్య బృందాలు, అంబులెన్సులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.

- Advertisement -

ఇక పార్టీ 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, వారు అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు.​

వందలాది మంది త్యాగాలతో తెలంగాణ ఉద్యమం సాగిందన్న కేసీఆర్. ఆ సమయంలో పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు నిశ్శబ్దంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం పదవులను త్యాగం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని గుర్తు చేశారు.​

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News