Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: బీసీ జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి

Khammam: బీసీ జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి

పిండిప్రోలు రామమూర్తి నేతృత్వంలో సాగిన భేటీ

బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిండిప్రోలు రామమూర్తి అధ్యక్షుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా పాల్గొని మాట్లాడుతూ బీసీ జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి ఇప్పటికైనా అన్ని పార్టీలు పునర్ ఆలోచించి బీసీలకు న్యాయం చేయాలి బీసీలు 50% పైగా ఉన్న రాజకీయంగా అన్ని పార్టీలు అన్యాయమే చేస్తున్నాయి రాజ్యాంగం కల్పించిన వాటా ప్రకారం మా వాటా మాకు దక్కాల్సి ఉన్న అన్ని పార్టీలు బీసీలను ఓట్లు వేసి యంత్రాలుగానే చూస్తున్నాయి వృత్తి కులాలు సంపద సృష్టిస్తున్న పన్నులు కడుతున్న వీరికి రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా ఎంపీ ఎమ్మెల్యేలు అవ్వడానికి పార్టీలు ఇష్టపడటం లేదు బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలు మన దేశంలో ఓబీసీ కులాలు 2600 కులాలు ఉంటే అందులో 2550 కులాలు నేటికీ అసెంబ్లీలో పార్లమెంటులో అడుగుపెట్టని కులాలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే 50 కోట్లు 100 కోట్లు పెట్టే వారికే ఇస్తామంటున్నారు బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కవద్దా ఇప్పటికైనా అన్ని పార్టీలు పునరాలోచించి జిల్లాకు ఒక ఎమ్మెల్యే టికెట్ అయినా బీసీలకు కేటాయించాలి అప్పుడే సామాజిక న్యాయం అవుతుంది అందుకోసమే బీసీలరా ఆలోచించండి మన వాటా మనకు దక్కాలంటే మనం ఒక తాటిపై ఉండాలి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిబీసీ రిజర్వేషన్ కల్పించే పార్టీలకే మన మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా అగ్రకుల పార్టీలు బీసీల కోసం పోరాడే పార్టీలు లేవు బీసీలు ఆర్థికంగా ఎదగక పోవటానికి కారణం ఇన్ని సంవత్సరాలు పాలించిన పార్టీలు కాదా బీసీ కుల గణన చేయాలి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది ఆర్ కృష్ణ అన్నగారి నాయకత్వంలో బీసీ ఉద్యమం బలోపేతం చేద్దాం ఏ పార్టీలో ఉన్నా బీసీ రిజర్వేషన్ లేకపోతే బీసీలకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వరు బీసీ రాజకీయ నాయకులు ఆలోచించి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుదాం అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. బీసీలందరం సంఘటితం అవుదాం బీసీ రాజ్యాధికారం సాధించుకుందాం ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు పోతగాని రమణ కుమార్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చేన్నోజు పుల్లయ్య ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లగిశెట్టి మహేష్ మధిర డివిజన్ అధ్యక్షులుమొరం పాపారావు నగర ప్రధాన కార్యదర్శి కేతనబోయిన నాగేశ్వరావు జిల్లా కోశాధికారి రాథోడ్ రాంబాబు ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు సావిడి శ్రీనివాస్ ఖమ్మం నగర కార్యదర్శి గజవెల్లి లక్ష్మీ వరప్రసాద్ కూసుమంచి మండల అధ్యక్షుడు నాయిని విజయ్ రఘునాథం పాలెం మండలం యువజన అధ్యక్షుడు ఆకులసురేష్ వివేకు శ్రీనివాసు నవీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News