ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐయన్ టీయూసి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ యవ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, తుమ్మల యుగంధర్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఖమ్మం నగరంలోని ఆటో అడ్డాలలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ట్రాఫిక్ పోలిసుల చలాన్లు ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకాలలో ఇండ్లు లేని ఆటో డ్రైవర్లలను గుర్తించి ఆటో డ్రైవర్లకు ఇండ్లు ఇవ్వాలని కోరారు.
సమస్యలపై సానుకూలంగా స్పందించిన తుమ్మల యుగంధర్ ఆటో డ్రైవర్ల సమస్యలపై మంత్రి వర్యులు తుమ్మలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని, ఆటో కార్మికులకు ఎల్లావేళాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు, ఐ ఎన్ టి యు సి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సైదులు, ఉపాధ్యక్షులు బొల్లిని నాగరాజు నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ నగర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఉపాధ్యక్షులు గయాజ్ పాష, నగర కమిటీ సభ్యులు యం వెంకట్ నాయుడు, గోపాల్, బాలకృష్ణ, నగేష్, జానీ, ఉమర్ , అడ్డా ప్రెసిడెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.