Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: విద్యార్థులతో కలిసి తాండాలో మధ్యాహ్న భోజనం తిన్న కలెక్టర్ గౌతం

Khammam: విద్యార్థులతో కలిసి తాండాలో మధ్యాహ్న భోజనం తిన్న కలెక్టర్ గౌతం

తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి


విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు. పాఠశాలల్లో ఏర్పాటుచేయనున్న పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన తనిఖీ పిమ్మట, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నమోదు తక్కువగా ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరంలో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు, ఈ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నమ్మకం పెంచాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మల్సూర్ తాండలోని మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజ పరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లాడ మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News