Monday, November 25, 2024
HomeతెలంగాణKhammam-Dep CM Bhatti reviewed relief operations: వరద సహాయక చర్యలు రివ్యూ చేసిన...

Khammam-Dep CM Bhatti reviewed relief operations: వరద సహాయక చర్యలు రివ్యూ చేసిన డిప్యూటీ సీఎం భట్టి

1912 , 18004250028 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా  ఏర్పడిన విద్యుత్  సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని జిల్లాల వారీగా విద్యుత్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో ఉన్న TGNPDCL అధికారులు అయిన నలుగురు సీఈలు, 16మంది ఎస్ఈలు, 40 మంది డీఈ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్ పోలీస్ రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలి.
వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్ స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు.
24/7 అలర్ట్ గా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పారు. విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు వైరు, ట్రాన్స్ఫార్మర్లు మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలి. విద్యుత్ అంతరాయం పునరుద్ధరణ పై  ఎస్ఈ లతో ఎప్పటికప్పుడు సమక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించిన డిప్యూటీ సీఎం భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వరద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉంది.

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అనుక్షణం ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. విద్యుత్తు, నిత్యవసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శిథిలమైన పురాతన భవనాల్లో ఉండకుండా వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912 , 18004250028 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ప్రజలనుంచి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుంది. సామాజిక బాధ్యతను విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించే విద్యుత్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News