Saturday, July 6, 2024
HomeతెలంగాణKhammam: కేయూలో ఎగ్జాం ఫీ పేరుతో దోపిడీ

Khammam: కేయూలో ఎగ్జాం ఫీ పేరుతో దోపిడీ

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని యూజీ, పీజీ ప్రొఫెషనల్ సెమిస్టర్ వైస్ పర్మిషన్ ఫీజును 3000 వేల రూపాయల నుండి 1000 రూపాయలకు, బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు సంబంధించిన ఒక్కొక్క పేపర్ కు పరీక్ష ఫీజును 5000 వేల నుండి 1000 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ముందు వీసీ రమేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా PDSU ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పాల్గోని మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్ ,నాన్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న ఇయర్, సెమిస్టర్ వైజ్ విద్యార్థుల యొక్క బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు పరీక్ష పేరుతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూజీ, పీజీ విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు ఇయర్ రెన్యువల్ పర్మిషన్ ఫీజు పేరుతో ఒక్కొక్క సబ్జెక్టుకు పరీక్ష ఫీజును అధికంగా నిర్ణయించడం అంటే పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యాను దూరం చేయడమామే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ నిర్దేశించిన ఈ ఫీజులను గ్రామీణ ప్రాంతా పేద ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల విద్యార్థులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని . విద్యార్థుల భవిష్యత్తు కొరకే బ్యాక్ లాగ్ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్న యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు భరించలేని విధంగా ఫీజులు నిర్ణయించడం చాలా దుర్మార్గమని, యూనివర్సిటీ అధికారులు నిర్ణయించిన ఈ ఫీజుల విధానం “విద్యార్థుల తలపై ఐస్ పెట్టి కింద మంట పెట్టిన” చందంగా ఉందన్నారు.
తక్షణమే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని యూజీ, పీజీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల కు సంబంధించిన ఇయర్లీవైస్ పర్మిషన్ ఫీజును 3000 నుండి 1000 రూపాయలకు, ఒక్కొక్క సబ్జెక్టు పేపర్ కు 4000 వేల రూపాయల నుండి 1000 రూపాయలకు తగ్గించాలని, అన్ని యూజీ ,పీజీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెమిస్టర్ వైస్ పర్మిషన్ కు నిర్దేశించిన 2000 ఫీజును 1000 రూపాయలకు, ఒక్కొక్క సబ్జెక్టు పేపర్ కు 3000 లుగా నిర్దేశించిన ఫీజును 1000 రూపాయలకు తగ్గించాలని అలాగే యూనివర్సిటీ వీసీ రమేష్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో పి. డి. ఎస్. యూ
ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్ యూ ఖమ్మం డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్,నాయకులు సాయి,రాకేష్,శివ,గణేష్,రవి,తరుణ్, నవ్య,సింధు,శిరీష కాలేజ్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News