Sunday, July 7, 2024
HomeతెలంగాణKhammam: ప్రభుత్వ ఆఫీసులు ప్రారంభించిన మంత్రులు

Khammam: ప్రభుత్వ ఆఫీసులు ప్రారంభించిన మంత్రులు

కోటి రూపాయలతో నిర్మించిన భవనాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి మైమూద్‌ అలీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం మండలంలో రూ. 50 లక్షలతో నిర్మించిన తహశీల్దారు కార్యాలయం, 50 లక్షలతో నిర్మించిన పోలీసు స్టేషన్‌ భవనాలను మంత్రులు ప్రారంభించి పరిపాలన కార్యక్రమాలను కొనసాగింప చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు మైమూద్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తాను ఖమ్మం జిల్లాకు రావడం జరిగిందని అప్పటి పరిస్థితులు నేడు జిల్లా రూపురేఖలు మారపోయాయన్నారు. అభివృద్ధి అంటే ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి కొనయాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పారిశ్రామిక, ఐటి రంగాలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు హైద్రాబాదు నగరంలో ఫార్మ, ఐటి, పారిశ్రామిక రంగాలను నెలకొల్పే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను నెలకొల్పేందుకు ఔత్సాహికు లైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఉంటాయన్న వారి నోరు మూయించి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకే దక్కుతుందని, మన ముఖ్యమంత్రి వర్యులు మంచి విజన్‌ కలిగిన వారని మంత్రి అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో సాగు, త్రాగు నీరుకు కొదవ లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తూ రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు భీమా పాలసీని కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా నూతన రెవెన్యూ చట్టం అమలుతో పాటు వ్యవసాయ భూ క్రయవిక్రయాలు పూర్తి పారదర్శకంగా జరిగిందేకు ధరణి పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి క్రైంరేటును తగ్గించగలిగా మన్నారు. మహిళల రక్షణకు షీటీమ్‌, భరోసా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్‌, దళితబంధు, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. వికలాంగులకు అందించే పింఛన్‌ను 3016 నుండి 4016కు పెంచడం జరిగిందన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాలలో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖ మంత్రి వర్యులు సహకారంతో జిల్లాకు అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.నగరంలో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం, నూతన బస్టాండ్‌, ఐటి హబ్‌, మంచి రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, లకారం ట్యాంక్‌బండ్‌, సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలను ప్రారంభించుకొని జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో కొత్తగా నిర్మించుకున్న తహశీల్దారు, పోలీసు భవనాలను ప్రారంభించుకొని పరిపాలన సౌలభ్యంను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఎర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పాలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామన్నారు.


జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లా మంత్రి వర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల ప్రత్యేక చొరవతో రఘునాథపాలెం మండలం తహశీల్దారు కార్యాలయం, పోలీసు స్టేషన్‌ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేయించి మండల పరిధిలోని ప్రజలకు పరిపాలన సౌలభ్యం చేరువ చేసారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళణ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ధరణి పోర్టల్‌ సేవల ద్వారా భూ క్రయ విక్రయాలను సులభతరం చేసి రిజిస్ట్రేషన్‌ కమ్‌ మ్యూటివేషన్‌ను వెను వెంటనే పూర్తి చేయడం జరిగిందన్నారు.అనంతరం జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా వివిధ దుర్ఘనల్లో అసువులు బాసిన 20 మంది పోలీసు అమరుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులకు ఇంటి పట్టాలను మంత్రిలు పంపిణీ చేశారు.రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంధ్ర, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్‌, రాష్ట్ర విత్తనాభి వృధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియానాయక్ నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, పోలీసు కమీషనర్‌ విష్ణు.యస్‌ . వారియర్‌ అదనపు డి.సి.పి సుభాష్‌ చంధ్రబోస్‌ తహశీల్దారు నరసింహరావు, జడ్పీటి.సి మాలోతు ప్రియాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News