Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: సబ్బండ వర్గాలకు ఆర్థిక చేయూత

Khammam: సబ్బండ వర్గాలకు ఆర్థిక చేయూత

పేదలందరిని ఆర్ధికంగా బలోపేతం చేసి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని మన సర్కారు

కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా చేయూత నందించి బలోపేతం చేస్తుందని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల్లో శుక్రవారం వైరా నియోజకవర్గంలో ఎన్‌.వి.ఎస్‌ గార్డెన్స్‌ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు రాములు నాయక్‌తో కలిసి లబ్ధిదారులకు రూ.1 లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందిస్తామన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన కుల, చేత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీ పరిధిలోని మీ సేవా కేంద్రాల్లో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు నేటి నుండి జూన్‌`20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు చేయాల్సింది ఒక్కటేనని కుల దృవీకరణ పత్రము, ఆదాయ దృవీకరణ పత్రము సమర్పించాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికేట్‌లు లేని వారికొరకు ప్రత్యేకంగా తహశీల్దారు కార్యాలయాల్లో ఈ నెల 12 న స్ఫెషల్‌ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. సర్పిఫికేట్లు అందించి అక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు తెలియజేసి వారితో దరఖాస్తు ఆన్‌లైన్‌ చేయించాలన్నారు. దీనితోపాటు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం పంపిణీ చేయిస్తామన్నారు. గతంలో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రయివేటు స్థలాలను కొనుగోలు చేసిన భూమిని ఇళ్ళు లేని పేదలకు పంపినీ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి నుండి పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాల మేరకు నేడు 100 మంది లబ్ధిదారులకు పట్టాలు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 ఎకరాలను 2 వేల మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తామన్నారు.
గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల, కురుమలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు గాను మొదటి విడతలో 16 వేల మంది గొల్ల కురుమలకు గొర్రెలను అందించామన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరో 16 వేల మంది లబ్ధిదారులకు గొర్రెల లభ్యతను బట్టి వచ్చే మూడు నెలల్లో గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. నేడు 10 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పేదలందరిని ఆర్ధికంగా బలోపేతం చేసి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని ఆయన తెలిపారు.

- Advertisement -


శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అవసరమైన పథకాలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆ దిశగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆడపిల్ల పెండ్టికి ఆర్ధి సహాయంతో కళ్యాణలక్ష్మీ, అనారోగ్యంకు గురైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక సహాయం అందించడంతో పాటు ఆసరా పింఛన్లు, ఇంటి స్థలాలు పంపిణీ ద్వారా మరింత లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు కుల, చేతి వృత్తులపై ఆధార పడి జీవనం కొనసాగిస్తున్న వెనుకబడిన తరగతుల వారికి లక్ష రూపాయల ఆర్ధిక చేయూతనందించి ఆసరాగా నిలుస్తున్నారని శాసనసభ్యులు తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, మండలం స్పెషల్ ఆఫీసర్ జె.సత్యనారాయణ, బి సి వెల్ఫేర్ అధికారి జ్యోతి, తహసీల్దార్ అరుణ, ఎమ్ పి డి ఓ. శ్రీదేవి, మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు కొణిజర్ల తహసీల్దార్ సైదులు ,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఎంపిటీసిలు, కౌన్సిలర్లు, రెవెన్యూ, వైద్య, మున్సిపల్‌ శాఖల అధికారులు, సిబ్బందిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News