Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: ఆరోగ్య తెలంగాణగా మన ప్రభుత్వం

Khammam: ఆరోగ్య తెలంగాణగా మన ప్రభుత్వం

ఇలాంటి పరుగు వల్ల యువకులు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వారి నిజ జీవితంలో ఇది ఎంతగానో మేలు చేస్తుంది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వైరా కమిషనరేట్ ఆధ్వర్యంలో తెలంగాణ 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు, లావుడియ రాములు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జండా ఊపి ఈ యొక్క తెలంగాణ 2Kరన్ ప్రారంభించారు. వందలాదిగా తరలివచ్చిన వివిధ మండలాల గ్రామాల ప్రజలు శాసనసభ్యులు ఉత్సాహంగా, ఉత్తేజపరుస్తూ తెలంగాణ టూ కే రన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఆరోగ్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో ఉంచారని, ఆరోగ్య మహిళ, కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్యకరమైన పథకాలు ప్రవేశపెట్టి చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్లు, మహిళలు వరకు ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తున్నారని, ఇలాంటి పరుగు వల్ల యువకులు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వారి నిజ జీవితంలో ఇది ఎంతగానో మేలు చేస్తుందని కొనియాడారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వారితోపాటు వైరా ఏసిపి రెహమాన్, సిఐ సురేష్, కొనిజర్ల ఎస్ఐ శంకర్రావు, వైరా ఎస్సై వీరప్రసాద్, కారేపల్లి ఎస్సై చింతకాని ఎస్ఐ ,తల్లాడ ఎస్సై, వివిధ మండలాల సర్పంచులు ఎంపీటీసీలు , కౌన్సిలర్స్,ఆరోగ్యశాఖ పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ ,రెవెన్యూ శాఖ, వైరా పట్టణ పుర ప్రముఖులు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ప్రభుత్వ శాఖల వారు అధికారులు వారందరితో కలిసి వైరా పురవీధుల్లో తెలంగాణ 2కే రన్ పాల్గొనడం జరిగింది ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం ప్రతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News