Monday, September 23, 2024
HomeతెలంగాణKhammam: కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు

Khammam: కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు

రాష్ట్రంలో ప్రతి పేదవాడు, సామాన్యుడు ఆర్ధిక పరిపుష్టి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా పేద నిరుపేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల్లో భాగంగా ఖమ్మం నగరం దోరేపల్లి ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం లబ్దిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమంలో మంత్రి ప్రభుత్వ ఉత్వర్వు నెం.58, 59 క్రింద రఘునాధపాలెం మండలం 2, నగరపాలక సంస్థ పరిధి 28,30, 31, 32, 34, 46, 48 డివిజన్‌లకు చెందిన లబ్దిదారులకు 148 పట్టాలు, ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ఇళ్ళు, ఇండ్ల స్థలాల పట్టాలను అందించారు. 2 వేల మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందించారు. గతంలో ప్రభత్వ స్థలాల్లో నివాసం ఏర్పర్చుకొని పట్టాలు లేని పరిస్థితి ఉండేదని, స్థానిక కార్పోరేటర్లు, నగర మేయర్‌ సమన్వయంతో వాటికి కూడా పట్టాలు అందించారు. దశాబ్ధి ఉత్సవాలు పూర్తయిన వెంటనే స్వంత స్థలం కలిగిన వారికి స్వంత ఇళ్లు నిర్మించుకునేందుకు 3 లక్షల రూపాయలను అందించే ప్రక్రియను త్వరలోనే రూపకల్పన చేస్తామన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మరో 11 వందల మంది దళిత కుటుంబాలకు దళితబందు లబ్ధి చేకూర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రజకులు ఇస్త్రీ షాపులకు, నాయి భ్రాహ్మణులకు సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుల- చేతి వృత్తులపై జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం రూ. 1 లక్ష ఆర్ధిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. 1001 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. బి.సి గురుకులాల్లో ఒక విద్యార్థిపై రూ.1 లక్ష 25 వేలు ఖర్చు చేశామన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రూ.100.90 కోట్లు కళ్యాణలక్ష్మీ/షాదిముబారక్‌, ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక సహకారం నిరంతరాయంగా కొనసాగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు, సామాన్యుడు ఆర్ధిక పరిపుష్టి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని, వారి అభివృద్ధి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉందని, అందుకే ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వారికోసం ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంతకు ముందు 200రూ లు, ఉన్న వృద్దాప్య పింఛన్‌ను 2016కు పెంచిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకే దక్కుతుందన్నారు. గొల్ల, కురుమలు ఆర్ధిక పరిపుష్టి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రెండవ విడతలో రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమలు రూ.8 వేల కోట్ల సంపద అర్జించారని మంత్రి తెలిపారు.


జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ జి.ఓ 58, 59 పథకం క్రింద ఎలాంటి ఆదెరువు లేని నిరుపదలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న వారికి ప్రభుత్వ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కు కల్పించాలనే సంకల్పంతో ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు 2 వేల 500 మంది పేదలకు పైగా పెద్ద ఎత్తున పట్టాలను అందించామని కలెక్టర్‌ తెలిపారు.
కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, పశుసంవర్ధక శాఖ జెడి.వేణుమనోహర్‌, బి.సి వెల్ఫేర్‌ అధికారి జ్యోతి, కార్పోరేటర్‌లు పగడాల నాగరాజు, శ్రీ విద్యా, కర్నాటి కృష్ణ, రాంమోహన్‌రావు, శ్రీకాంత్‌, శ్రీదేవి, వెంకటేశ్వర్లు,జ్యోతి రెడ్డి,హుస్సేన్, శ్రీనివాస్,లక్ష్మి,గోవిందమ్మా, ఉమారాణి. కమల, రోజలిన, విజయనిర్మల, సరస్వతి, వైశ్నవి, రోషిని, కరుణ, రమ, లక్ష్మి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News