Friday, November 22, 2024
HomeతెలంగాణKhammam: ఇటలీ దంపతులకు దత్తత..

Khammam: ఇటలీ దంపతులకు దత్తత..

ఖమ్మం బాలుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు

పిల్లలు లేని దంపతులకు దత్తత ఒక వరమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసిలోని కలెక్టర్ ఛాంబర్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఖమ్మం జిల్లా బాలల సంరక్షణాలయంకు చెందిన బాబును కారా నిబంధనల మేరకు చట్ట ప్రకారం ఇటలీకి చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గల 18 సంవత్సరాలలోపు బాలబాలికలు (అనాధ, వదిలివేయబడిన, స్థోమత లేని తల్లిదండ్రులు) చట్టప్రకారం దత్తత ప్రక్రియలోకి తీసుకువచ్చి, జిల్లా కలెక్టర్ ద్వారా కారా నిబంధనల మేరకు దత్తత ఇస్తున్నట్టు తెలిపారు. పిల్లలు లేని దంపతులు www.cara.nic.in వెబ్ సైట్ ద్వారా 18 సంవత్సరాల లోపు పిల్లలను దత్తత తీసుకోవచ్చని, దత్తత ప్రక్రియ గురించి అంగన్వాడీ టీచర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహను సంప్రదించాలని, దత్తత ద్వారా ఇట్టి అవకాశాన్ని పిల్లలు లేని దంపతులు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, డిసిపిఓ విష్ణు వందన, ప్రొటెక్షన్ అధికారిణి సోని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News