Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: కేసీఆర్ పథకాలు వైపు చూస్తున్న రాష్ట్రాలు

Khammam: కేసీఆర్ పథకాలు వైపు చూస్తున్న రాష్ట్రాలు

కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నారు

కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలోని శ్రీ సిటీలో సిరియాల నివాసంలో జరిగిన తేనేటి విందు కార్యక్రమంలో వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరియాల కుటుంబ సభ్యులను నూతన గృహ నిర్మాణం చేసుకున్న సందర్భంగా మదన్ లాల్ అభినందించారు. అనంతరం అక్కడున్న బి ఆర్ ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మదన్ లాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కెసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి పలు రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని మదన్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరియల, లాలయ్య, సైదులు,పెద్ద పిచ్చయ్య, చిన్న పిచ్చయ్య, కిలారి కిరణ్ కుమార్, పాముల వెంకటేశ్వర్లు, మాదినేని ప్రసాద్, కొత్త వెంకటేశ్వరరావు, రావెళ్ళ రవి, పూర్ణ, నందా, పొట్లపల్లి వెంకన్న, నాగరాజు, ధనుంజయ్, శ్రీకాంత్, వెంకటేష్, రంజాన్, రామనాథం, శ్రీను, శ్రీకాంత్, బ్రాహ్మయ్య, లాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News