Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: మెగా జాబ్ మేళా ప్రారంభం

Khammam: మెగా జాబ్ మేళా ప్రారంభం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అధ్బుతమైన అవకాశం ఈ జాబ్ మేళా వేదిక
150 కంపెనీలలో 8200 ఉద్యోగ, ఉపాధి కల్పనతో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పలువురికి నియామక పత్రాలు అందజేశారు. 5025 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కంపెనీలు మరో 3000 వరకు రెండు రోజుల్లో అందజేయనున్నారు.
8000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం వల్ల జిల్లా నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశమని మంత్రి పువ్వాడ అన్నారు. నగరంలోని SBIT ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ మెగా జాబ్ మేళాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొని
వివిధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి నియామకాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. 150 కంపెనీలలో ఉన్న 8200 ఉద్యోగాలకు గాను 15వేల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని అన్నారు. సుమారు 60 శాతం మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తున్నారని ఇది యువతకు అద్బుతమైన అవకాశమని అన్నారు.
ప్రస్తుత పోటి ప్రపంచంలో విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం పొందటం సాధ్యం కాదని, అలాంటి వారికోసమే జాబ్ మేళాను నిర్వహిస్తామన్నారు. చదువులలో అద్భుతంగా రాణిస్తున్న ఖమ్మం యువత ప్రభుత్వ, ప్రైవేట్ రంగం తో పాటు వ్యాపారాల్లో సైతం రాణించాలంటే వచ్చిన ఈ అవకాశాలు అంది పుచ్చుకొని భవిష్యత్తుకు పునాదులు వేస్తారని యువతపై ప్రగాఢ నమ్మకం వుందన్నారు.
పురోగతి, ప్రగతి వైపు ప్రయాణిస్తుంది కాబట్టే తెలంగాణ డైనమిక్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుండి ఐటి కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు. ఐటి రంగంలో బెంగుళూరు ను మించి తెలంగాణ రాష్ట్రం ముందుకు దుసుకెళ్తుందని, తద్వారా ఐటి, కార్పొరేట్ రంగాలలో పెద్దఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనకు సాధ్యం అవుతుందన్నారు.
నేడు ఐటి రంగంలో ఖమ్మం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకుంది అన్నారు. విదేశాల్లో ఉన్న ఐటి దిగ్గజాలు అయిన ప్రవాస భారతీయులతో, విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటిఆర్ ఖమ్మం ఐటి హబ్ గూర్చి ప్రస్తావించడం మనకు గర్వకారణం అన్నారు. ఒకపుడు 53 వేల కోట్ల ఐటి రంగం ఎగుమతులు ఉండగా నేడు 1.87 కోట్ల ఐటి ఎగుమతులకు చేరుకున్నమన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, మీ భాగస్వామ్యంతోనే రాబోయే తరాలకు ఇలాంటి అనేక జాబ్ మేళాలు అందించాలని కోరారు
ఒకప్పుడు మనం తిండి గింజల కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డ సందర్భాలు ఉన్నాయని, కానీ నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఅర్ పాలనలో నేడు మనమే దేశానికి తిండి గింజలు ఎగుమతి చేసి “Rice bowl of Telangana” స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ, భద్రతతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత కొద్దిరోజులగా అహర్నిశలు కష్టపడిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ , జిల్లాను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ గౌతమ్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి లను మంత్రి పువ్వాడ అభినందించారు. ఈ సందర్భంగా పలు కంపనీలలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అందజేశారు. ఈరోజు 5025 మంది నిరుద్యోగ యువతకు పలు కంపెనీలు నియామక పత్రాలు అందజేశారు మరో 3000 మందికి రెండు రోజుల్లో నియామక పత్రాలు అందజేయనున్న కంపెనీలు ప్రకటించాయి జాబ్ మేళా సందర్భంగా పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. 200 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. యువతకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగ, అంబులెన్స్ అత్యవసర కోసం మెడికల్ బృందాలను ఏర్పాటు చేశారు.
చంటిపిల్లల తల్లులకు, గర్బిణి మహిళలకు వెసులుబాటు కల్పించి ముందువరసలో పంపించారు. SBIT విద్యా సంస్థల చైర్మన్ RJC కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ IPS అవినాష్ వివిధ కంపెనీల CEO లు, డైరెక్టర్ లు, HR మేనేజర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News