Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: బిజీగా మంత్రి పువ్వాడ ప్రోగ్రామ్స్

Khammam: బిజీగా మంత్రి పువ్వాడ ప్రోగ్రామ్స్

ఒకే నమూనా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు దేశంలో ఎక్కడా లేవు,, మన రాష్ట్రంలోనే నిర్మించుకున్నాం

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి
17 లక్షలతో వ్యయంతో నిర్మించిన సెక్యూరిటీ గదికి ప్రారంభోత్సవం చేశారు. 100.78 లక్షల వ్యయంతో చేపట్టనున్న సోలార్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులతో సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. క్రొత్త గ్రామ పంచాయితీలు, మండలాలు, డివిజన్లు, మునిసిపాలిటీలు, జిల్లాలు ఏర్పాటు చేసి, ప్రజల వద్దకు పాలన సత్వరంగా అందేలా చర్యలు తీసుకుందని అన్నారు. ఒకే నమూనా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు దేశంలో ఎక్కడా లేవని, మన రాష్ట్రంలోనే నిర్మించుకున్నామని అన్నారు. ఇప్పటికే 20 సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి తెచ్చామని మంత్రి అన్నారు. సుపరిపాలనకు గొప్ప ఆలోచనలు చేస్తూ, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం మోడల్ గా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, వివి పాలెం సర్పంచ్ రావెళ్ళ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News