Thursday, October 3, 2024
HomeతెలంగాణKhammam: బతుకమ్మ పండుగలో ఎంపీ దంపతులు

Khammam: బతుకమ్మ పండుగలో ఎంపీ దంపతులు

ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు. బతుకమ్మ సంబురాలలో ఆడిపాడారు ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు. ఈ సందర్భంగా బురహాన్ పురం 51వ డివిజన్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సంబురాలలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వారి ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -

అక్కడ హాజరైన మహిళలతో పాటు తెలంగాణ ఆడబిడ్డలందరికి వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ రమ ఆమె భర్త, బీఆర్ఎస్ నాయకుడు శీలంశెట్టి వీరభద్రం తదితరులతో కలిసి ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు
బతుకమ్మ సంబురాలలో ఆడిపాడారు. ఈ సంబురాలలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News