Friday, April 4, 2025
HomeతెలంగాణKhammam: ఘనంగా పీవీ జయంతి

Khammam: ఘనంగా పీవీ జయంతి

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలి

దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పి.వి. నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా స్థానిక లకారం సర్కిల్ నందు గల పి.వి. నరసింహారావు విగ్రహానికి మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, తెలంగాణ ప్రభుత్వం వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగిన రీతిలో గౌరవిస్తుందన్నారు. పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మంత్రి అన్నారు.

- Advertisement -
 ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News