Friday, April 4, 2025
HomeతెలంగాణKhammam: రామసహాయం గెలుపుతో కాంగ్రెస్ లో హుషారు

Khammam: రామసహాయం గెలుపుతో కాంగ్రెస్ లో హుషారు

లోకసభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన రామసహాయం రఘురాం రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ కి ఇక్కడ మరింత జోష్ వచ్చింది. ఈమేరకు ఎన్నిక సర్టిఫికెట్ ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే, కౌంటింగ్ పరిశీలకులు ప్రేదిమాన్ కృషన్ భట్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News