గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పోట్ల నాగేశ్వరరావుతో కలసి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ కు బీఫామ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వైరా నియోజకవర్గ సీటును కాంగ్రెస్ కు కేటాయించినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ, టిపిసిసి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని నామినేషన్ల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు దొబ్బల సౌజన్య, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంపుడి రోశయ్య, కోటరు నర్సిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, స్వర్ణ నరేందర్, రఫీ తదితర నాయకులు పాల్గొన్నారు.