Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: అరుదైన ఒంగోలు గిత్తల పరిశోధనా కేంద్రం కోసం డిమాండ్

Khammam: అరుదైన ఒంగోలు గిత్తల పరిశోధనా కేంద్రం కోసం డిమాండ్

ఒంగోలు గిత్తల జాతి పరిరక్షణలో భాగంగా ఖమ్మంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ను కోరుతామని బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర వెల్లడించారు. పార్థసారథి రెడ్డి స్వగ్రామం కందుకూరులో జరిగిన ఎడ్ల పందేలను ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ మధు కలిసి చూశారు. ఈ కార్యక్రమానికి ముందు సత్తుపల్లి నుంచి వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వెంట రాగా కందుకూరు చేరుకున్నారు అతిథులు. ఈ పోటీలను తిలకించేందుకు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు,ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావటం విశేషం.
రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కందుకూరులో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లు బండ లాగడం, కబడ్డీ పోటీలు జరిగాయి. పార్థసారథి రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా జరిగాయి. ఎడ్ల పందేలు,కబడ్డీ పోటీలలో విజేతలైన వారికి అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News