Tuesday, September 17, 2024
HomeతెలంగాణKhammam: జిల్లాలో ఎంపీ రవిచంద్ర విస్త్రత పర్యటన

Khammam: జిల్లాలో ఎంపీ రవిచంద్ర విస్త్రత పర్యటన

ఇక్కడ ఎవరి పప్పులు ఉడకవు, ఆటలు సాగవు అంటూ బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అన్నారు.  బీఆర్ఎస్ 10కి 10 అసెంబ్లీ సీట్లను అఖండ మెజారిటీతో గెల్చుకోవడం, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం తథ్యమని ఎంపీ రవిచంద్ర ఖమ్మం నగరంలోని 48వ డివిజన్, నాగులవంచ, నేలకొండపల్లిలలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు అతిథిగా హాజరయ్యారు ఎంపీ రవిచంద్ర.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులివ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పారు. దీంతో ఈ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోటగా మారిందని, ఇక్కడ ఉన్న 10కి 10 అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో గెల్చుకోవడం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.ఈ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, గులాబీ శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారని,ఇక్కడి ప్రజలు తెలివైన వాళ్లని, రాజకీయ చైతన్యం గలవారని,వేరే వాళ్ల పప్పులు ఉడకవని,ఆటలు సాగవని రవిచంద్ర స్పష్టం చేశారు.మాజీ ఎంపీ పొంగులేటి,మాజీ మంత్రి జూపల్లిలను ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ గొప్పగా ఆదరిస్తే,అన్ని విధాలా బాగుపడి ఇప్పుడు పార్టీకి ద్రోహం తలపెట్టడం తీవ్ర విచారకరమన్నారు.ఆ ఇద్దరి వెంట వెంట ప్రజలు లేరని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతు కేసీఆర్, బీఆర్ఎస్ లకు ఉందని రవిచంద్ర వివరించారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు,మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నాగులవంచలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంఛార్జి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రాంమూర్తి, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సమ్మేళనాలకు  గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,జై భారత్ జైజై భారత్”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ జిందాబాద్”అనే నినాదాలు మిన్నంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News