Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: సండ్ర ఆధ్వర్యంలో గోశాలలకు గ్రాసం

Khammam: సండ్ర ఆధ్వర్యంలో గోశాలలకు గ్రాసం

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఖమ్మంలోని గోశాలలకు పశుగ్రాస వితరణకు సత్తుపల్లి మండలం, నారాయణపురం గ్రామం నుండి పసుగ్రాసంతో బయలుదేరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి బయలుదేరిన పశుగ్రాసాన్ని ఖమ్మంలో గోశాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా గోశాలకు వితరణ చేయనున్నారు. ఖమ్మంలోని 11 గోశాలలకు సత్తుపల్లి నియోజకవర్గంలో నుండి 150 ట్రాక్టర్ ట్రక్కుల పశుగ్రాసం వితరణ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. గోశాలలో నిర్వహించిన గోపూజలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,ఖమ్మం అదనపు కలెక్టరు మధుసూదన్ , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు మూగ జీవాలకు పశుగ్రాసాన్ని వితరణ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారని, గో సేవ ఎంతో గొప్ప కార్యక్రమమని వాటికి సేవ చేసుకునే భాగ్యం పశుగ్రాస వితరణతో కలగడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మంలోని 11 గోశాలలకు సత్తుపల్లి నియోజకవర్గం నుండి 150 ట్రాక్టరు ట్రక్కుల పశుగ్రాసాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసారు. ఖమ్మంలోని టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల వద్ద రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , అదనపు కలెక్టరు మధుసూదన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు గోపూజ నిర్వహించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ నోరు ఉండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సహాయం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సహాయం అందించాలనే సంకల్పంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సహకారంతో ఐదు ఏళ్ల నుండి గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేస్తున్నామని అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా 120 కిలోమీటర్ల నుండి ఖమ్మంకు 150 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని ఆనందించేందుకు రైతులు పిలుపు మేరకు స్వచ్చందంగా సహకరించారన్నారు. రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాలి, గోవును పూజించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల సహాయం అందిస్తే, నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో, గోవులకు సహాయం అందించాలని ఆ రోజుల్లో పిలుపునిస్తే వందల సంఖ్యలో పశుగ్రాసం దొరకని సమయంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భద్రాచలం గోశాలలకు పశుగ్రాసాన్ని అందించామన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా గోశాలకు పశుగ్రాసాన్ని అందించి చేయూతని ఇచ్చామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News