బీజేపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కమల వికాసం కోసం అహరహం శ్రమిస్తానని పార్టీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. బీజేపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఖమ్మం ప్రజలతో ఉండి ఎప్పటికి వారికి సేవ చేయాలని తాను వచ్చానని, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా అనునిత్యం వారితో మమేకమై ఉంటానని చెప్పారు. డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్నా, ఖమ్మం ప్రజలు 1.18 లక్షల ఓట్లు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన రామ సహాయం రఘురామి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు.
గత మూడు నెలలుగా నా వెన్నంటే ఉండి నా గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం, జన సేన, ఎం ఆర్ పీ ఎస్ క్యాడర్ కు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాస్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, సీనియర్ నాయకులు, గెంటెల విద్యాసాగర్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి, దానియకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Khammam: కార్యకర్తలకు అండగా నిలుస్తా: తాండ్ర వినోద్ రావు
గెలుపోటములతో సంబంధం లేకుండా..