Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తాం

Khammam: ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తాం


ప్రతి ఫిర్యాదులో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు, భార్య భర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News