Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana Crime: నీ లాంటి తండ్రి ఎవరికి వద్దు..వాడ్ని విడిచిపెట్టొద్దు!

Telangana Crime: నీ లాంటి తండ్రి ఎవరికి వద్దు..వాడ్ని విడిచిపెట్టొద్దు!

Khammam Crime:ఖమ్మం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన యువతి రమ్య, ప్రేమ పేరుతో మోసపోయానన్న వేదనను భరించలేక తన ప్రాణాలు తానే తీసుకుంది. విశాఖపట్నంలో అద్దె గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

మైనర్ కావడంతో..

వివరాల్లోకి వెళ్తే, ఎర్రగడ్డ గ్రామానికి చెందిన మేడే నరేష్, అదే గ్రామానికి చెందిన రమ్యతో కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ వ్యవహారం బయటపడిన తర్వాత, ఇద్దరూ తమ కుటుంబాలను విడిచి వెళ్లిపోయారు. కానీ రమ్య మైనర్ కావడంతో, కుటుంబ పెద్దలు వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి సర్దిచెప్పారు. ఆ సమయంలో రమ్య చదువును కొనసాగిస్తుండగా, నరేష్ తల్లిదండ్రులు అతనికి మరో యువతితో వివాహం జరిపించారు.

మెడికల్ షాపులో…

ఆ తర్వాత రమ్య చదువును మధ్యలోనే ఆపేసి, హైదరాబాద్‌లోని ఒక మెడికల్ షాపులో ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. మరోవైపు నరేష్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడి, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరు జీవితాలను కొనసాగిస్తున్నట్లే కనిపించినా, వారి మధ్య సంబంధం పూర్తిగా తెగిపోలేదు.

ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా రమ్య తన ఊరికి వచ్చింది. అదే సమయంలో నరేష్ కూడా ఊరికి వచ్చినట్లు సమాచారం. పండుగ అనంతరం ఇద్దరూ తమ కుటుంబాలకు తెలియకుండా విశాఖపట్నం వెళ్లారు. అక్కడ నరేష్, రమ్య మెడలో తాళి కట్టి వివాహం జరిగినట్లుగా చూపించాడు. దాంతో వారు వైజాగ్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని కలిసి ఉండడం మొదలు పెట్టారు.

రాఖీ పండుగ రోజునుంచి…

ఇంతలో, రాఖీ పండుగ రోజునుంచి తమ కుమారుడు కనిపించడం లేదని నరేష్ తండ్రి బొందయ్య, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విశాఖలో వదిలేసి…

ఈ విషయం తెలుసుకున్న నరేష్, రమ్యను విశాఖలో వదిలేసి రెండు రోజుల క్రితం తన సొంతూరు ఎర్రగడ్డకు వచ్చేశాడు. రమ్య ఎన్నిసార్లు నరేష్‌కు ఫోన్ చేసినా, అతని మొబైల్ స్విచ్ ఆఫ్‌లోనే ఉండడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ప్రేమ పేరుతో మోసపోయానన్న విషయం ఆమెను బాగా కుంగదీసింది. చివరికి తన తల్లిదండ్రులకు ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసి, అద్దె గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: https://teluguprabha.net/telangana-news/mahesh-kumar-goud-slams-bjp-challenges-bandi-sanjay-on-elections/

రమ్య తండ్రి ఈ విషయం తెలుసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, రమ్య రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నరేష్ ప్రవర్తనే రమ్య ప్రాణాలు తీసేలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad