పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ తరపున ఘనంగా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆధునికత జీవన శైలిలో భాగంగా వచ్చిన మానసిక ఒత్తిడి,అలసటను పోగొట్టి ప్రశాంతతను ఏర్పాటుకై ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో నవ్వును ఒక ఔషధం గా అలవాటు చేసుకోవాలని, దీని వలన అనుబంధాలు, మమతానురాగాలు పెరిగి అనుకూలత వైఖరులు కలిగి సంపూర్ణ ఆరోగ్య వంతులవుతారని తెలియపర్చారు కార్యక్రమంలో పాల్గొన్నవారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ యోగ లాఫింగ్ ఇంటర్ నేషనల్ ట్రైనర్-నగర న్యాయవాది మరికంటి వెంకట్ గారిచే లాఫింగ్ యోగ, లాఫింగ్ ఏరోబిక్-మరెన్నో నవ్వుచే వినోదాత్మక కార్యక్రమాలు మా వాకర్స్ సభ్యులకు ఏర్పాటు చేశాననని ఆయన వివరించారు. కార్యక్రమంలో సుదర్శన్, రాకం శ్యామ్ బాబు, దుర్గేశ్, వెంకట్, డాక్టర్ సీతయ్య, దామోదర్ రెడ్డి, వేణు, నర్సింహారావు, మంగ, రజనీ, రామ, ఫాతిమా, సుజాతలు పాల్గొన్నారు.