యాదవుల మనోభావలను గుర్తించి, NTR విగ్రహం మార్పు చేసినట్టు, నిన్న హైకోర్టు స్టే ఇచ్చి, విగ్రహం స్థాపన ఆపివేయాలని, హైకోర్టు ఆర్డర్ నేపథ్యం లో యాదవ-ఇతర సంఘాల, 14 పిటిషన్లు, వాదనలు జరిగి మనిషి మనిషి లాగానే ఉండాలని, దేవుడు దేవుడు లాగానే ఉండాలని, దేవుడి రూపాన్ని మనిషిలో కలపకూడదు అని హైకోర్టు ముట్టి కాయలు వేయగా మార్పులు చేస్తాం అని నిర్వాహకులు అన్నారు. ఖమ్మం లకారం టాంక్ బండ్ పై స్థాపించే NTR విగ్రహానికి యాదవుల పూర్తి మద్దతు తెలిపారు. ఇక మీదట ఎవరి మనోభావలు దెబ్బ తినకుండా, విగ్రహం స్థాపించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కృష్ణుడి రూపం తొలిగించి NTR విగ్రహ స్థాపనకు చొరవ చూపించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి యాదవ సంఘం కృతజ్ఞతలు తెలిపారు జిల్లా ఉపాధ్యక్షుడు జాల నరసింహారావు యాదవ్, ఈ సమావేశం లో పాల్గొన్న నాయకులు మాడుగుల పెద్ద వెంకటేశ్వర్లు, వల్లపు వెంకటేశ్వర్లు, వల్లపు నరసింహారావు, మాడుగుల శ్రీను, జాల శ్రీను, జాల కిట్టు, జాల మధు, మహిళా నాయకురాలు జాల అనసుర్య, జాల మని, జాల సుగుణ, మాడుగుల నాగేంద్ర.