Sunday, April 6, 2025
HomeతెలంగాణKhanapur: బిజీగా బాధవత్ పూర్ణ చందర్ నాయక్

Khanapur: బిజీగా బాధవత్ పూర్ణ చందర్ నాయక్

ఖానాపూర్ నియోజక వర్గ స్థానిక ముద్దు బిడ్డ బాధవత్ పూర్ణ చందర్ నాయక్ తన నియోజక వర్గ పర్యటనలో భాగంగా సిరికొండ మండలంలో కలియ తిరిగారు. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ లు, ఎంపీటీసీలను కలుసుకుని వారితో వివిధ అంశాలపై చర్చించారు. యువ నాయకులు మండలానికి విచ్చేసిన సందర్భంగా ప్రజాప్రతినిధులు, మండల వాసులు ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. అనంతరం మండలంలోని మారుమూల గ్రామాలైన కోయల్ పాండ్రి, ధస్నాపూర్ ఇతర గూడాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై ఆత్మీయంగా వారిని పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు, వేసవి కాలంలో నీటి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తన వెంట సిరికొండ బిఆరెస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News