Sunday, October 6, 2024
HomeతెలంగాణKhatar NRIs: గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకే మద్దతు

Khatar NRIs: గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకే మద్దతు

జీవన్ రెడ్డికి జై: ఖతర్ ఎన్నారైలు

గల్ఫ్ దేశం ఖతర్ లో ఉన్న కోరుట్ల నియోజకవర్గ ఎన్నారై లు కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నారై ముహమ్మద్ నసీర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా గల్ఫ్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ 5 లక్షల ఎక్స్ గ్రేసియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించిన అంశం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు గల్ఫ్ వాసుల సంక్షేమం పట్ల ఆలోచనా చేసిన సందర్భం కూడా లేదని విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వలస జీవుల సంక్షేమం కోసం ప్రకటించిన మిగతా హామీలను కూడా త్వరలో తప్పకుండా అమలు చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నమని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

- Advertisement -

1977 నుంచి ప్రజా సేవలో ఉండి, 45 ఏళ్లుగా పదవిలో ఉన్న లేకున్నా నిత్యం ప్రజల మద్యలో ఉండి అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రైతుబిడ్డ తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కోసం వీలు అయినా రీతిలో ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.. బిజెపి అసమర్థత విధానాల వల్ల దేశంలోని వలసకార్మికులతో పాటుగా విదేశాల్లో ఉంటున్న గల్ఫ్ వలస కార్మికులకు కూడా తిప్పలు తప్పలేదని విచారం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ముహమ్మద్ నసీర్,ఆసీఫ్, సతీష్,మనోజ్, శ్రావణ్, ప్రవీణ్, రమేష్, లక్ష్మణ్, ఖాజా నవాజ్, అమీన్, మణికంఠ,రాజేందర్ తదితరులు ఉన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News