Friday, September 20, 2024
HomeతెలంగాణKodimyala: హనుమాన్ దేవాలయంలో పూజలు, అన్నదానం

Kodimyala: హనుమాన్ దేవాలయంలో పూజలు, అన్నదానం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని వడ్రంగి వీదిలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జయంతికి ముందు వచ్చే మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వాములు, భక్తులు హనుమాన్ దండకం, చాలీసా చదివి పూజలు చేశారు. దాదాపు 650 మంది దీక్ష స్వాములు, భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయం అధ్యక్షులు బాలయ్య, హనుమాన్ దేవాలయం ప్రధాన కార్యదర్శి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్, సభ్యులు రాజిరెడ్డి, మల్లయ్య, పూజారి గంగాచారి, అధిక సంఖ్యలో దీక్ష స్వాములు, భక్తులు నరసింహారెడ్డి, కోంజర్ల రవీందర్, ఆదిరెడ్డి, హరికృష్ణ, నాగార్జున, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News